Breaking News
recent

చెన్నైలో ఆక్సిజన్ అందక 18 మంది మృతి




చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో వైద్య సేవలు అందక 18 మంది చనిపోయారు. ఆక్సీజన్ సిలిండర్లు, విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో వెంటిలేటర్ వ్యవస్థ  పని చేయడం లేదు. ఐసీయూలో చికిత్స పొంతుతున్న రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 18 మంది రోగులు చనిపోయారు. మిగిలిన రోగులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు అధికారులు. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కరెంట్ సరఫరా నిలిపోయింది. రోడ్లపై నడుంలోతు నీరు నిలిచిపోవడంతో వైద్య సిబ్బంది కూడా ఆస్పత్రికి చేరుకోలేని పరిస్థితి. అయితే అనారోగ్యంతోనే చనిపోయారంటున్నారు అధికారులు.

Powered by Blogger.